యాప్నగరం

NHRC విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు :దిశ తల్లిదండ్రులు

పోలీసులు దిశ తల్లిదండ్రులకు నచ్చ చెప్పి, NHRC విచారణకు హాజరయ్యేందుకు ఒప్పించారు. దీంతో దిశ సోదరి సహా తల్లిదండ్రులు పోలీసులు సమకూర్చిన ప్రత్యేక వాహనంలో విచారణకు వెళ్లారు. అంతకుముందు విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని దిశ తల్లిదండ్రులు ఆరోపించారు.

Samayam Telugu 8 Dec 2019, 5:39 pm
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మరింత విచారణ కోసం బాధితురాలి కుటుంబ సభ్యులను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆహ్వానించింది. వారి వాంగ్మూలం నమోదు చేసుకొనేందుకు పిలిచినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు దిశ సోదరి, తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి వెళ్లారు.
Samayam Telugu Disha Parents


Also Read: హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ క్షమాపణ

అయితే, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుల ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు సమాచారం అందించగా, తొలుత వారు నిరాకరించారు. దిశ దశ దిన కర్మ ఉండడమే కాక, ఆమె తల్లి ఆరోగ్యం బాగా లేనందున తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పోలీసులు విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని దిశ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇందుకు కాలనీ వాసులు సైతం మద్దతు పలికారు. ఎన్‌హెచ్‌ఆర్సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

Also Read: Disha case: నిందితుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
కాసేపటికి పోలీసులు దిశ తల్లిదండ్రులకు నచ్చ చెప్పి, విచారణకు వచ్చేందుకు ఒప్పించారు. దీంతో దిశ సోదరి సహా తల్లిదండ్రులు పోలీసులు సమకూర్చిన ప్రత్యేక వాహనంలో విచారణకు బయల్దేరారు. ఈ విచారణ గంటపాటు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు ముందు నలుగురు నిందితుల చేతిలో గాయాలపాలైన ఇద్దరు పోలీసులు వెంకటేశ్వర్లు, అరవింద్‌ గౌడ్‌ను కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రమే కేర్‌ ఆసుపత్రికి వెళ్లి వారిని విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. వీరి వాంగ్మూలం కూడా రికార్డు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Also Read: ఆ పథకం కంటే మన ఆరోగ్యశ్రీ ఎంతో బెటర్ :ఈటల

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.