యాప్నగరం

వరవరరావు అల్లుడుకు నోటీసులు.. విచారణకు రావలన్న ఎన్ఐఏ

2018లోనే ఎన్ఐఏ అధికారులు వరవరరావు అల్లుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పుడు ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు.

Samayam Telugu 7 Sep 2020, 1:01 pm
ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్, వరవరరావు అల్లుడు అయిన సత్యనారాయణకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. ఈనెల 9వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ప్రధాని హత్యకు కుట్ర చేశారన్న భీమ కొరేగాన్ కేసు లో 2018లో విరసం నేత వరవరరావును అరెస్ట్ ను చేసిన పూణె పోలీసులు. అయితే ఇప్పుడు ఇదే కేసులో వ‌ర‌వ‌ర‌రావు అల్లుడుకు నోటీసులు అందించారు.
Samayam Telugu వరవరరావు అల్లుడు సత్యనారాయణ
NIA summons to sons in law of Varavara Rao


Read More: కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి

అయితే ఇఫ్లూ ప్రొఫెస‌ర్ అయిన కె. స‌త్య‌నారాయ‌ణ ఇంటిపై 2018లోనే ఎన్ఐఏ సోదాలు చేసింది. కానీ ఆ త‌ర్వాత ఎలాంటి స‌మాచారం ఇవ్వలేదు. కానీ ఇటీవ‌ల ఎన్ఐఏ స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు ఆయ‌న సోద‌రుడు జ‌ర్న‌లిస్ట్ కుర్మ‌నాథ్ ల‌ను 09.09.2020నాడు విచార‌ణ‌కు హ‌జ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేసింది. అయితే త‌న‌కు ఆ కేసులు, కుట్ర‌ల‌తో ఎలాంటి సంబంధం లేద‌ని, త‌న మామ అయినంత మాత్రాన త‌న‌ను కుట్ర‌లో భాగం చేస్తున్నార‌ని ప్రొ.స‌త్య‌నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌వ‌రరావుతో చుట్ట‌రికం మాత్ర‌మే ఉంద‌ని కానీ త‌న‌కు కేసుల‌తో ఎలాంటి సంబంధం సత్యనారాయణ చెబుతున్నారు.

Read More: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దు

2018లో అరెస్ట్ అయిన వ‌ర‌వ‌రరావు అప్ప‌టి నుండి మ‌హారాష్ట్రలోని జైల్లోనే ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ కూడా వచ్చింది దీంతో ఆస్పత్రిలో చికిత్స కూడా అందించారు. అయితే ఆయ‌న‌కు జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోయింద‌ని కుటుంబ స‌భ్యులన్నారు
ముంబైలో క‌రోనా క‌ల్లోలంతో పాటు వ‌ర‌వ‌రరావు ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేక త‌మ కుటుంబం మొత్తం తీవ్ర దుఖంలో ఉన్న సంద‌ర్భంలో ఇప్పుడు మా కుటుంబాన్ని ఈ నోటీసుల‌తో తమను మరింత వేధింపులకు గురి చేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.