యాప్నగరం

ఎమ్మెల్యే కుమారుడి వీరంగం.. తాగి వేధింపులు! కేసు నమోదు

Patancheru MLA: మద్యం సేవించిన ఆయన తన ప్రతాపం చూపిస్తూ.. మామూళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్ష సాక్షులు వీడియో తీయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యాపారులు ఎందుకు డబ్బులివ్వాలని ప్రశ్నించారు.

Samayam Telugu 23 Jan 2020, 3:19 pm
హైదరాబాద్ శివారు పటాన్‌చెరు నియోజకవర్గ శాసనసభ్యుడు మహిపాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎందుకంటే, ఆయన కుమారుడు విష్ణు వర్థన్ చిరు వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారనే వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విష్ణువర్థన్ రెడ్డి సహా అతని అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తమను బెదిరించి ఎమ్మెల్యే కుమారుడు డబ్బు డిమాండ్ చేశారని కిరణ్ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం సేవించిన ఆయన తన ప్రతాపం చూపిస్తూ.. మామూళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్ష సాక్షులు వీడియో తీయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తనయుడు మామూళ్లు డిమాండ్ చేస్తుండగా, కొందరు వ్యాపారులు ఎందుకు డబ్బులివ్వాలని ప్రశ్నించారు.
Samayam Telugu Gudem mahipal reddy
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (పాత చిత్రం)/Twitter


Also Read: చలి కాలంలోనూ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. కారణమదేనా?

మెదక్‌ జిల్లాలో కొందరు చిరు వ్యాపారులు వీధుల పక్కన చిన్నచిన్న దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోడ్లపై అమ్మకాలు నిబంధనలకు విరుద్ధం కావడంతో పోలీసులు వచ్చినప్పుడు వాటిని వెనక్కి జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు వస్తారా అనే ఆందోళన వారిలో ఉంటుంది. మరోవైపు, మున్సిపాలిటీకి కూడా ఎంతో కొంత చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు కూడా వారి వద్దకు వచ్చారు. మాముళ్లు ఇవ్వమని అడగడంతో అంతా నోరెళ్లబెట్టారు.

Also Read: జగిత్యాల కలెక్టర్‌కు అరుదైన గుర్తింపు

మీకెందుకు మామూళ్లు ఇవ్వాలని ప్రశ్నించినా ఎమ్మెల్యే తనయుడు వినిపించుకోలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. మాముళ్లు ఇవ్వనంటారా అని షాపులపై దాడికి తెగబడ్డాడు. తమను మాముళ్లు ఇవ్వాలని అడిగాడని, ఇవ్వకపోవడంతో షాపులపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణు వర్థన్ మద్యం సేవించి హల్‌చల్ చేసినట్లు పోలీసులు నిర్ధరించారు.

Also Read: మెట్రో షటిల్ తరహాలో స్టేషన్ల నుంచి కొత్త రకం సేవలు.. తక్కువ ధరకే!
Also Read: సీఏఏ: ఒవైసీ భారీ ర్యాలీకి ఎదురుదెబ్బ?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.