యాప్నగరం

అడవి పందులను చంపండి, తినండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Janagama: ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గుర్తు చేశారు.

Samayam Telugu 13 Sep 2020, 4:22 pm
అడవి పందులు పంట పొలాలను ఎంతగానో నాశనం చేస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. అలాంటి అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. జనగామ పట్టణంలో శనివారం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గుర్తు చేశారు.
Samayam Telugu ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (ఫైల్ ఫోటో)
muthireddy yadagiri reddy


జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనాను జయించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా బారినపడ్డ తొలి ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం. గత జూన్ 12న ఈయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అంతకుముందే ఆయన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో, ఇతర వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్న వారంతా అప్పుడు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.