యాప్నగరం

నా వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారు.. క్షమించండి :శంకర్ నాయక్

అమెరికాకు ప్రెసిడెండ్ అయిన అబ్రహం లింకన్ గురించి నేను మాట్లాడుతుంటే.. దాన్ని అపార్థం చేసుకున్నారు. మీడియాలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. రెడ్డి, వెలమ సోదరుల అండ నాకు ఉంది.

Samayam Telugu 25 Dec 2019, 3:04 pm
రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ నోరు జారిన సంగతి తెలిసిందే. కులాల ప్రస్తావన తీసుకొచ్చి, ఓ రెండు కులాలకు బలుపు ఎక్కువ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసముద్రంలో జరిగిన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
Samayam Telugu Shanker Naik


Also Read: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆటో ఢీ!

‘‘నేను మాట్లాడిన భావం వేరు.. దాని సారాంశం వేరు. అమెరికాకు ప్రెసిడెండ్ అయిన అబ్రహం లింకన్ గురించి నేను మాట్లాడుతుంటే.. దాన్ని అపార్థం చేసుకున్నారు. మీడియాలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. రెడ్డి, వెలమ సోదరుల అండ నాకు ఉంది. వారి సహకారంతోనే నేను ఎమ్మెల్యేనయ్యాను. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలి. టీవీ చర్చల్లో ఏది పడితే అది మాట్లాడుతుండడం బాధగా ఉంది. కేసీఆర్ దయవల్లే నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచా. ఆ వ్యాఖ్యల గురించి కేసీఆర్‌కు కూడా చెప్పా. నేను వాటిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని కేసీఆర్‌కు వివరించా.’’ అని మీడియాతో అన్నారు.

Also Read: హీరా గోల్డ్: నౌహీరా షేక్ కేసులో కీలక పరిణామం

కేసముద్రంలో ఓ వేదికపై శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మూడు రకాల బలుపులుంటాయని.. అందులో వెలమ, రెడ్ల బలుపు ఒకటంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.

Also Read: నగరంలో కి‘లేడీ’లు: ఉద్యోగం పేరుతో గాలం, దుబాయ్ పంపి.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.