యాప్నగరం

దిశ కేసు నిందితులకు సరైన శిక్ష.. జయహో తెలంగాణ పోలీస్ అంటూ ప్రశంసలు

దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ తరవ్ాత జయహో తెలంగాణ పోలీసులు అంటున్న ప్రజలు, నెటిజన్లు.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో తెలంగాణ పోలీసులు.

Samayam Telugu 6 Dec 2019, 12:37 pm
దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారని దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారమే ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో జరిగిన ఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ అత్యాచారం చేయబడ్డ బాధితురాలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతుండగా నిందితుడు బాధితురాలిపై పెట్రోల్ పోసి అతి క్రూరంగా చంపాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు దానికి భిన్నంగా నిందితుల్ని కాల్చి చంపారు అంటున్నారు ప్రజలు.
Samayam Telugu police.

వరంగల్ లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచార నిందితుడికి పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరి శిక్ష విధించేలా పక్కా ఆధారాల్తో చర్యలు తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. కానీ దాన్ని హైకోర్ట్ కొట్టివేస్తూ ఉరి శిక్షను కాస్త యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ ఘటనలో పోలీసులు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఈ ఘటనను కూడా పోలీసుల పనితీరుకు నిదర్శనంగా.. మరో ఉదాహరణగా గుర్తు చేస్తున్నారు. ఘటన ఏదైనా తెలంగాణ పోలీసులు స్పందిస్తున్న తీరు.. వారి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ పోలీసుల పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
ఏది ఏమైనా ఈ సంఘటనతో కొన్ని విషయాల్లో న్యాయస్థానాలతో, నాయకులతో ప్రజలకు న్యాయం జరగదని.. అలాంటి వాటిలో పోలీసులతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ పోలీసుల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటూ దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.