యాప్నగరం

దేశ రెండో రాజధానిగా హైదరాబాద్?: కేటీఆర్ రియాక్షన్ ఇదీ

TimesNow Summit | దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడానికి భాగ్యనగర ప్రజలు అంగీకరించరని మంత్రి కేటీఆర్ తెలిపారు. టైమ్స్ నౌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 13 Feb 2020, 1:58 pm
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేసే అవకాశం ఉంది చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టైమ్స్ నౌ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు అనురాగ్ అనే వ్యక్తి ఇదే ప్రశ్నను సంధించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడానికి భాగ్యనగర ప్రజలు అంగీకరించరన్నారు. ఈ ప్రతిపాదనకు కేజ్రీవాల్ కూడా అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. తనకు కూడా ఈ ప్రతిపాదన పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందన్న కేటీఆర్.. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పలు సర్వేల్లో ఉత్తమ నివాస యోగ్యమైన నగరంగా భాగ్యనగరం అవార్డులు అందుకుందన్నారు.
Samayam Telugu ktr indiaitmes


కేంద్రం నుంచి మాటసాయం కాదు, ఆర్థిక తోడ్పాటు కోరుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించిందన్నారు. కానీ కేంద్రం నుంచి మాకు రూపాయి కూడా అందలేదన్నారు. సమాఖ్య వ్యవస్థ, టీమిండియా అనేవి మాటలకే పరిమితం అవుతున్నాయన్నారు.

టీమిండియా, సహకార సమాఖ్య వ్యవస్థ పట్ల కేంద్రం సీరియస్‌గా ఉంటే.. రాష్ట్రాలకు తగిన రీతిలో ఆదాయంలో వాటా పంచాలని కేటీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.