యాప్నగరం

వెటర్నరీ డాక్టర్ హత్యకేసు: నిందితుల వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెండ్

వెటర్నరీ డాక్టర్ హత్యకేసుకు సంబంధించి మరో కానిస్టేబుల్‌పై వేటు. జైల్లో నిందితుల వీడియో తీసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్. జైలు అధికారుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.

Samayam Telugu 2 Dec 2019, 3:32 pm
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశా హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ ప్రధానంగా వినిపిస్తోంది. ఇటు నిందితుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు.. ఇక లాయర్లు నిందితుల తరపున వాదించేది లేదని తీర్మానం చేసేశారు.
Samayam Telugu cons.


Read Also: దిశా హత్యకేసు నిందితులు.. తొలిరోజు మటన్‌తో భోజనం

ఈ రగడ కొనసాగుతుండగానే.. హత్యకేసు నిందితుల వీడియోను రికార్డ్ చేసి.. లీక్ చేసిన కానిస్టేబుల్‌ను పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రవి అనే కానిస్టేబుల్ చర్లపల్లి జైలులో ఈ వీడియోను తన మొబైల్‌లో తీసినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా వీడియో తీసినందుకు వేటు వేశారు. అతడిపై కేసు కూడా నమోదు చేసి దర్యాప్తునకు సిద్ధమవుతున్నారు.

కానిస్టేబుల్ రవి నిందితుల వీడియో తీశారని చర్లపల్లి జైలు అధికారులు.. సీపీలు, సజ్జనార్, మహేష్ భగత్‌లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు రావడంతో అతడిపై చర్యలకు సిద్ధమయ్యారు. నలుగురు నిందితుల్ని శనివారం రోజు కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. జైల్లో వాళ్లు నిలబడి ఉన్న సమయంలో.. కానిస్టేబుల్ రవి వీడియో తీశాడు.. తర్వాత ఈ వీడియో మీడియాకు లీక్ కావడంతో విషయం బయటపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.