యాప్నగరం

గాంధీ ఆస్పత్రిలో 2 గంటల కరెంటు కోత! మంత్రి ఈటల సీరియస్

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కరెంటు అంతరాయంపై మంత్రి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. వెంటనే అక్కడికి జనరేటర్ పంపాల్సిందిగా ఆదేశించారు.

Samayam Telugu 23 Jul 2020, 7:13 pm
గాంధీ ఆస్పత్రిలో గురువారం కొంత సేపు కరెంటు పోవడం సంచలనం సృష్టిస్తోంది. కరోనా వార్డులో దాదాపు రెండు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పేషంట్లు చీకటిలోనే ఇబ్బంది పడ్డారు. వైద్య సిబ్బంది సైతం రోగులకు చికిత్స అందించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత కాసేపటికి విద్యుత్తు సరఫరాను గాంధీ ఆస్పత్రి సిబ్బంది పునరుద్ధరించారు.
Samayam Telugu గాంధీ హాస్పిటల్
gandhi hospital


గాంధీ ఆస్పత్రిలో కరెంటు అంతరాయంపై మంత్రి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. వెంటనే అక్కడికి జనరేటర్ పంపాల్సిందిగా ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రులతో పాటు అన్ని ఆస్పత్రుల్లో జనరేటర్లు చెక్ చేసి పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. అందులోకి సరిపడా డీజిల్ నిల్వలు ఉంచుకోవాలని నిర్దేశించారు. ప్రభుత్వ జనరేటర్లు సరిపోకపోయినా, అందుబాటులో లేకపోయినా, అవసరమైతే ప్రైవేటు జనరేటర్లు వాడుకోవాలని సూచించారు.

Must Read:undefined

Must Read: కరోనా మరణాలు: లాజిక్‌తో కొట్టిన ఎమ్మెల్యే సీతక్క.. సంచలన వీడియో బయటికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.