యాప్నగరం

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి నివేదిక కోరారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇందుకోసం కేంద్ర హోంశాఖను ఆదేశించారు.

Samayam Telugu 14 Aug 2019, 9:24 am
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. దీనిపై వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను స్పందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు కూడా ఫెయిల్ కావడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇంటర్ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద రోజుల తరబడి ఆందోళన చేపట్టారు.
Samayam Telugu pjimage (2)


దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు. అప్పటికే చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన విద్యార్థుల్లో చాలామంది రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులు కావడం విషాదాన్ని నింపింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని విన్నవించారు. తాజాగా 27 మంది విద్యార్థుల పూర్తి వివరాలను బీజేపీ నేతలు తాజాగా రాష్ట్రపతికి పంపించారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి దీనిపై వాస్తవ నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. దీంతో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ హోంశాఖ వర్గాలు తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి ఈ నెల 7వ తేదీన లేఖ రాసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.