యాప్నగరం

ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింది్ విందు. 90 నుంచి 95 మంది అథితులకు మాత్రమే ఆహ్వానం. జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ నెల 25న విందుకు హాజరుకానున్న తెలంగాణ సీఎం.

Samayam Telugu 22 Feb 2020, 12:16 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా ట్రంప్‌కు గౌరవార్థం ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రామ్‌నాథ్ కోవింద్ ఆహ్వానించారు. ఈ విందుకు అతి తక్కువగా అంటే 90 నుంచి 95 మంది అథితులకు మాత్రమే ఆహ్వానం ఉంది.
Samayam Telugu president ramnath kovind hosts dinner for donald trump special invitation for telangana cm kcr also
ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం!


ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అందినిట్లు తెలుస్తోంది. విందుకు ఆహ్వానం రావడంతో ఈనెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారు.. రాష్ట్రపతి ఆతిథ్యం స్వీకరించనున్నారు. తెలంగాణ సీఎంతో పాటు మహారాష్ట్ర, హర్యానా, బీహార్‌, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. 2017లో ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ వచ్చారు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆతిధ్యం స్వీకరించారు. సీఎం కేసీఆర్ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. నగరంలో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు చూడటానికి ఇవాంకాతో కలిసి వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.