యాప్నగరం

తెలంగాణలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా

Primary Agriculture Cooperative Societies ఎన్నికలను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 4 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు.

Samayam Telugu 30 Jan 2020, 12:03 am
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. త్వరలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) ఎన్నికలు నిర్వహించనున్నారు. పీఏసీఎస్‌ల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం (జనవరి 29) ఆదేశించారు. పర్సన్ ఇన్‌ఛార్జీల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు.
Samayam Telugu Kcr2


15 రోజుల్లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించి, పీఎసీలకు కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 120 మున్సిపాలిటీల్లో 112, పదింటికి 10 కార్పొరేషన్లను గెలుచుకొని ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో టీఆర్‌ఎస్ పార్టీ నిలిచింది. ఇదే ఊపులో మిగిలిన కోపరేటివ్ సంఘాల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని గులాబీ దళపతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: దేశంలో 6 హైస్పీడ్‌ రైల్వే కారిడార్లు.. జాబితాలో హైదరాబాద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.