యాప్నగరం

బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఏమన్నారంటే..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్‌పై ఆరా తీసినట్లు తెలిసింది. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బండి సంజయ్ వెళుతుండగా..

Authored byAshok Krindinti | Samayam Telugu 15 May 2022, 7:03 pm
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్‌పై ఆరా తీసినట్లు తెలిసింది. అదేవిధంగా పాదయాత్ర నిర్వహించిన కార్యకర్తలకు ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పూర్తిచేసుకుని ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బండి సంజయ్ వెళుతుండగా.. మార్గమధ్యలో మోదీ నుంచి ఫోన్ వచ్చినట్లు బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu బండి సంజయ్‌కు మోదీ ఫోన్


ప్రజా సంగ్రామ సేనతోపాటు పాదయాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు అభినందనలు చెప్పాలని బండి సంజయ్‌కు ప్రధాని సూచించారు. పాదయాత్ర గురించి మోదీకి సంజయ్ వివరించారు. రెండు విడతల్లో కలిపి 770 కి.లో మీటర్లు నడిచినట్లు చెప్పారు. నడిచింది తానయినా.. నడిపించింది మీరే అని.. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని ప్రధానితో అన్నారు.

పాదయాత్రలో ప్రజలు స్పందన గురించి మోదీ తెలుసుకున్నారు. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. పాదయాత్రలో కేంద్రం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని మోదీతో అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.