యాప్నగరం

బిచ్చగాడి దారుణ హత్య.. సైదాబాద్‌లో సైకో దారుణం

Saidabad పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై డబ్బులు అడుక్కుంటున్న ఓ వ్యక్తిని ఓ సైకో దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 7 Jan 2020, 3:12 pm
హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తిని ఓ సైకో దారుణంగా చంపేశాడు. మంగళవారం (జనవరి 7) మధ్యాహ్నం సైదాబాద్‌లోని దోబీఘాట్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై ఈ దారుణం జరిగింది. సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి డబ్బులు అడుక్కుంటుండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి రోడ్డుపై హల్‌చల్ చేసుకుంటూ వచ్చాడు. ఉన్నపలంగా ఆ బిచ్చగాడి మెడకు బట్ట చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే భిక్షాటన చేస్తున్న వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిశాయి.
Samayam Telugu Saidabad murder


హఠాత్పరిణామానికి స్థానికులు షాక్‌కు గురయ్యారు. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భిక్షగాడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: హెల్మెట్ పెట్టుకో బిడ్డా.. ట్రాఫిక్ ఎస్‌ఐ కౌన్సెలింగ్ వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.