యాప్నగరం

టీపీసీసీ చీఫ్ ఎవరు? సస్పెన్స్‌కు తెర... ఆయన వచ్చేశారుగా

టీపీసీసీ చీఫ్ ఎన్నికకు అంతా సిద్ధమైంది మరోసారి సోనియా రాహుల్ గాందీ చర్చలు జరిపి త్వరలోనే పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 4 Jan 2021, 11:05 am
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ వీడడం లేదు. ఇంతవరకు ఎవరి పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలోనే టీపీసీసీ నియమాకానికి లైన్ క్లియర్ కాబోతుంది. విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ తిరుగుప్రయాణం కావడంతో ఈ అంశం త్వరలోనే తేలిపోనుంది. ఇన్నాళ్లు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్... పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ రాష్ట్రంలోని ముఖ్య నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సీనియర్ నాయకులతో సంప్రదింపులు కూడా జరిగాయి. కొందరు సీనియర్లను ఢిల్లీకి పిలిచి పీసీసీ నియామకంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Samayam Telugu టీపీసీసీ చీఫ్ ఎన్నిక
tpcc new chief


అయితే ఇంతలో రాహుల్ గాంధీ క్రిస్టమస్ వేడుకలకు విదేశాలకు వెళ్లారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఎన్నికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాహుల్ తిరిగి రావడంతో ఇప్పుడు అంతా సిద్ధం చేశారు ఇంఛార్జి ఠాగూర్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్, వేణుగోపాల్ ఇచ్చిన నివేదికపై మరో సారి సోనియా.. రాహుల్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో త్వరలోనే టీపీసీసీ చీఫ్ ఎవరు అన్న సస్పెన్స్‌కు తెర పడనుంది. మరోవైపు పీసీసీ జాబితాలో... ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. సీఎల్పీ నేత భట్టి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు కూడా ప్రయత్నాలు సీరియస్ గానే చేస్తున్నారు.

Read More: తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

అయితే రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా పలువురు సీనియర్లు జట్టు కట్టినా... హైకమాండ్ కూడా దీనిని పరిగణలోనికి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడపడం ఎలా..? అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది ఏఐసీసీ. ఇటు ఒకరిద్దరు సీనియర్లతో రాహుల్‌ మాట్లాడిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి... సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిలతో రాహుల్ మాట్లాడి.. త్వరలోనే పీసీసీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీతో పాటు... ప్రచార కమిటీ... మేనిఫెస్టో కమిటీ.. ప్రోగ్రామింగ్ కమిటీ.. మీడియా కో ఆర్డినేషన్ కమిటీలను కూడా ప్రకటించనుంది కాంగ్రెస్ అధిష్టానం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.