యాప్నగరం

సికింద్రాబాద్ రైల్ నిలయం మూసివేత.. 30 మందికి కరోనా

రెండు రోజుల పాటు రైల్ నిలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాల్ని శానిటైజర్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Samayam Telugu 14 Sep 2020, 7:39 pm
సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపింది. 30 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. రైల్‌ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు 2500 మంది సిబ్బందికి కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. దీంతో వారిలో 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల పాటు రైల్‌ నిలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భవనాన్ని శానిటైజ్‌ చేయనున్నట్టు రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. లిఫ్టులు, టాయిలెట్స్, అందరూ తిరిగే ప్రాంతాల్ని శానిటైజ్ చేయనున్నారు. తిరిగి బుధవారం కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. వైరస్‌ సోకిన వారిలో చాలా మందిలో లక్షణాలు లేనట్టు తెలిపారు.
Samayam Telugu సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
secunderabad railway station


Read More: నాంపల్లి ఎమ్మెల్యేకు కరోనా... జాఫర్ హుస్సేన్‌కు పాజిటివ్

మరోవైపు తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. నిత్యం రెండువేలు దాటి నమోదవుతున్న కేసులు సోమవారం మాత్రం 1417 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే వైరస్‌ బారిన పడిన 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.