తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుంటున్నాయి. జార్ఖండ్‌పై రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మధ్యప్రదేశ్‌పైకి విస్తరించంది. అలాగే దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. దీనికి తోడు తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. శుక్రవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. మరోవైపు రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటూ నాగర్ కర్నూల్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే వర్షాలు ఊపందుకోవడంతో ప్రాజెక్టులకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి.
మరోవైపు హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తండగా.. వాతావరణం కాస్త భిన్నంగా ఉంటోంది. గత నాలుగైదు రోజులుగా వర్షం పడుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాన పడగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. విచిత్రంగా మధ్యాహ్నం వరకు ఎండ మండిపోతే.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.. మూడు గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆందోళన మొదలైంది.