యాప్నగరం

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు మోస్తారు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 30 Jul 2020, 10:05 am
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, మెదక్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జోగుళాంబ గద్వాల, జగిత్యాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Samayam Telugu తెలంగాణకు వర్ష సూచన
rainfall warning to telangana


బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. రుతుపవనా లకుతోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ హైద రాబాద్‌లో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. వచ్చే రెండోరోజుల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో కూడా రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.
Read More: కొత్త సచివాలయ డిజైన్‌కు మళ్లీ మార్పులు.. సీఎం కీలక సూచనలు
ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం కూడా చల్లగా మారింది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో వర్షాలు బాగానే పడుతున్నాయి. దక్షిణకోస్తా ఆంధ్రాలోని కొన్నిచోట్ల ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మరికొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.