యాప్నగరం

రామకృష్ణ మఠం: ‘జెన్ నెక్ట్స్’ నైపుణ్యాభివృద్ధి తరగతులు

వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హ్యమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో జెన్ నెక్ట్స్ పేరుతో యువత కోపం నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించనుంది. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Samayam Telugu 17 Nov 2019, 10:07 pm
స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశానికి అత్యుత్తమ మానవ వనరులను అందించేందుకు రామకృష్ణ మఠం తన వంతు కృషి చేస్తోంది. కళాశాలల విద్యార్థులు, యువ ఉద్యోగులు, మహిళలకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్), భావవ్యక్తీకరణ నైపుణ్యాలు(కమ్యూనికేషన్ స్కిల్స్), ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణం.. సమస్యలను అధిగమించడం వంటి అంశాల్లో తరగతులు నిర్వహిస్తోంది.
Samayam Telugu skill


వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హ్యమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు జెన్ నెక్ట్స్ పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్‌ను రూపొందించింది. అనేక భాషలు, భిన్న సంస్కృతులున్న భారత దేశంపై సమగ్ర అధ్యయనం.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎలా స్వయంవృద్ధి చెందాలి అనే విషయాలపై యువతకు శిక్షణనిస్తారు.

Also Read: హైలైట్‌గా హైదరాబాద్‌ రోప్ బ్రిడ్జి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం.. సరైన నిర్ణయాలు తీసుకోవడం.. తార్కిక ఆలోచనలు(లాజికల్ థింకింగ్) తదితర విషయాలపై బోధిస్తారు. ప్రణాళికలు రచించడం.. వాటిని సమర్థంగా నిర్వహించడం.. స్వీయ నియంత్రణ నైపుణ్యాలు.. యువత నెరవేర్చాల్సిన బాధ్యతలపై స్వామీజీ శిక్షణిస్తారు. ఈ నెల 18 నుంచి 22 వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.30 గంటల వరకు తరగతులు ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.