యాప్నగరం

రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయాలి: జయాబచ్చన్

Shamshabad: శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై దారుణ అత్యాచారం, హత్య ఘటనపై పార్లమెంట్ ఉభయసభల్లో వాడీవేడీ చర్చ జరిగింది. ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ ఇలాంటి నేరగాళ్లను బహిరంగంగా ఉరి తీయాలన్నారు.

Samayam Telugu 2 Dec 2019, 3:46 pm
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు వ్యవహారంపై పార్లమెంటులో సోమవారం (డిసెంబర్ 2) వాడీవేడీ చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సహా పలువురు సభ్యులు ఈ హత్యోదంతంపై తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా.. అమితాబ్ బచ్చన్ సతీమణి, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మాట్లాడుతూ.. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడేవారికి క్షమాభిక్ష అవకాశం లేకుండా, బహిరంగంగా ఉరి తీయాలని పేర్కొన్నారు.
Samayam Telugu జయాబచ్చన్


‘ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పష్టంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం ఘటనలోనూ బాధితులకు ఇంతవరకూ న్యాయం జరగలేదు’ అని జయాబచ్చన్ అన్నారు. ఇదే అంశంపై మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ భావోద్వేగానికి గురయ్యారు.

నవంబర్ 27న షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిని నలుగురు రాక్షసులు దారుణంగా హత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 9.30 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న యువతిని అపహరించిన కామాంధులు నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.