యాప్నగరం

ఏటికేడు తెలంగాణ దూకుడు.. వెనకబడిన ఏపీ.. కేంద్రం షాకింగ్ రిపోర్ట్

వ్యవసాయంలో తెలంగాణలో దూసుకుపోతుంది. ధాన్యపు రాశుల సేకరణలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి రాజ్యసభలో సమాధానమిచ్చారు. అయితే ఏపీ వెనకబడడం ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 31 Jul 2021, 3:36 pm
ఒకప్పుడు రాళ్లగుట్టలు.. కొండకోనలు.. బీడుభూములు.. ఫ్లోరైడ్ వాటర్‌తో వెనకబడిపోయిన తెలంగాణ నేడు వ్యవసాయంలో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ధాన్యపు రాశుల దిగుబడిలో ధీటుగా నిలుస్తోంది. దేశంలోనే అత్యధికంగా ధాన్యం సేకరించే పంజాబ్ తర్వాత స్థానంలో నిలిచి అబ్బురపరుస్తోంది. గత రెండేళ్ల వ్యవధిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించిన ధాన్యంలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం విశేషం. గతేడాది సుమారు 1.41 కోట్ల టన్నుల ధాన్యం సేకరించి పంజాబ్ తరువాతి స్థానంలో నిలిచింది. ఈ సూచీలో ఏపీ వెనకబడడం గమనార్హం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ap telangana


ఫుడ్ కార్పొరేషన్ ద్వారా పంజాబ్ తర్వాత తెలంగాణ అత్యధికంగా ధాన్యం సేకరించినట్లు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019-20 ఏడాదికి గానూ తెలంగాణ 111.26 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. గతేడాది 2020-21కి సంబంధించి 141.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించి దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది.

అదే సమయంలో ఏపీ 82.58 లక్షల టన్నులతో మూడో స్థానంలో నిలవగా.. గతేడాది కూడా పెద్దగా పెరగకపోవడం గమనార్హం. 2020-21లో 82.60 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఏటికేడు తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తుండగా ఏపీ కేవలం 0.02 శాతం పెరుగుదల మాత్రమే నమోదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికీ రైతుప్రభుత్వమని.. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో అనతికాలంలోనే వ్యవసాయరంగంలో అద్భుత విజయాలు సాధించామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.