యాప్నగరం

మేడ్చల్: ఒకే రోడ్డుపై ఒకేసారి వరుసగా 15 ప్రమాదాలు

ఇవాళ ఉదయం నుంచి వరుసగా 15 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.దీంతో డంపింగ్ యార్డు అధికారుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు.

Samayam Telugu 29 Dec 2020, 9:59 am
మేడ్చల్ జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జవహార్ నగర్ కార్పోరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ రోడ్ఢు పై రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి. వేగంగా కారు, ఆటో బోల్తా పడడంతో ద్విచక్ర వాహన దారులు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుండి వరుసగా సుమారు 15 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వారం రోజులుగా తరచూ డెంటల్ కాలేజీ నుండి సి.ఆర్.పి.యఫ్ వెల్లే దారిలో ప్రమాదాలు జరుగుతు న్నాయి.డంపింగ్ యార్డ్ నుండి రసాయానాలు రోడ్ల పైకి రావడం, దానికి చలి మంచు తోడు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu మేడ్చల్ రోడ్డు ప్రమాదాలు
medchal accidents


Read More: తాళిబొట్టు తీసేసి... నవవధువు సూసైడ్ నోట్

అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుననారు. ప్రమాదాలతో రోడ్డుపై నెత్తురోడి డంపింగ్ యార్డ్ కు బలవుతేనేగాని స్పందించరా అంటూ అధికారులపై ప్రజలు మండి పడుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టకపోతే.. అమాయకులు ప్రమాదాలబారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. డంపింగ్ యార్డు విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.