యాప్నగరం

జగిత్యాల జిల్లాలో భారీ చోరీ.. వైన్ షాపు లాకర్ ఓపెన్ చేసి

లాకర్ ఓపెన్ చేసి దొంగ... అందులో ఉన్న ఐదు లక్షల రూపాయలను దొంగతనం చేసి ఎత్తుకెళ్లాడు. ఉదయం షాపు తెరిచిన యజమాని షాక్ అయ్యి పోలీసులకు తెలిపాడు.

Samayam Telugu 18 Jan 2021, 12:01 pm
జగిత్యాల జిల్లాలో భారీ చోరీ జరిగింది. మల్లాపూర్ మండలం.. రేగుంట గ్రామం. వైన్స్ షాప్ లో నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. వైన్ షాప్ లో కి దొంగతనానికి వెళ్లిన యువకుడు లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న 5 లక్షల రూపాయలు దొంగతనం చేశాడు. ఉదయం షాప్ తేవడానికి వైన్ షాప్ ఓనర్ షాక్ అయ్యాడు. షాపు తెరిచి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Samayam Telugu జగిత్యాలలో చోరీ
robbery in jagityal


Read More: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై పులి.. భయాందోళనల్లో సిబ్బంది

విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న సిసి కెమెరా ను పరిశీలించారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వారే అని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. షాపులో పనిచేసే వారితో పాటు.. నిత్యం షాపుకు వచ్చే వారిని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.