యాప్నగరం

ఆర్టీసీ సమ్మె.. మరో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

RTC Strike: ఆర్టీసీ సమ్మె ఉగ్ర రూపం దాలుస్తోంది. కార్మికుల ఆత్మహత్యాయత్నాలు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Samayam Telugu 14 Oct 2019, 5:35 pm
ర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చింది. శ్రీనివాస్‌ రెడ్డి, సురేందర్‌ గౌడ్‌ ఆత్మహత్యలతో సమ్మె ఉగ్రరూపం దాల్చగా.. తాజాగా మరో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ డిపో వద్ద ఆర్టీసీ కండక్టర్‌ జి సందీవ్‌ (40) బ్లేడ్‌తో చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న తోటి కార్మికులు గమనించి ఆయణ్ని వారించారు. చికిత్స నిమిత్తం వెంటనే కొండాపూర్‌ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu strike


ప్రస్తుతం సందీప్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడు నగరంలోని యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.

Must Read: ‘కారు’కు అడ్డొస్తున్న ‘బస్సు’.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?

ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోగా.. హైదరాబాద్‌లో సురేందర్ గౌడ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. ఆర్టీసీ జేఏసీకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, సంస్థలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తున్నాయి.

Also Read: ఆర్టీసీ విలీనం సరికాదు.. కేసీఆర్‌కు జేపీ అనూహ్య మద్దతు

కామారెడ్డిలో కండక్టర్‌కు విరిగిన చేయి
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కామారెడ్డిలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాజేశ్‌ అనే కండక్టర్‌కు చేయి విరిగింది. తోటి కార్మికులు ఆయణ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.