యాప్నగరం

ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన.. 12వ రోజు సమ్మె ఉధృతం

సమ్మె 12వ రోజుకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళన తీవ్రతరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వినూత్న ప్రదర్శనలు చేశారు.

Samayam Telugu 16 Oct 2019, 6:52 pm
ర్టీసీ సమ్మె 12వ రోజుకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్మికులు వినూత్న ప్రదర్శనలు చేశారు.
Samayam Telugu Hanamkonda


ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎస్‌ఎఫ్) ఉస్మానియా యూనివర్సిటీలో బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో బీసీ సంఘాల నేత కృష్ణయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.

Must Read: ఆర్టీసీ కార్మికులకు సోమవారం లోగా జీతాలు చెల్లించాలి: హైకోర్టు

కరీంనగర్‌లో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. కరీంనగర్ చౌరస్తాలో భిక్షాటన చేశారు. రాస్తారోకో సందర్భంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఉపాధ్యాయులు, బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన 12వ రోజుకు చేరుకోవడంతో.. సమ్మెకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. అయితే.. చర్చలపై స్పష్టత రాకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Don't Miss: మనం ఏపీలోనే ఉన్నామా.. విలేకరి హత్యపై పవన్ కళ్యాణ్ ఫైర్

హైకోర్టు ఆదేశం, టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. కానీ, చర్చల విషయంలో కేసీఆర్ సర్కార్ ఇంకా నాన్చుడు ధోరణిలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ఆది నుంచి చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. కార్మికుల ఆత్మహత్యల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారినా.. అదే వైఖరిని కొనసాగిస్తుండటం గమనార్హం. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళన ఉధృతం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.