యాప్నగరం

రాహుల్‌కి ఇచ్చిన మాట తప్పుతున్నా.. రేపు సంచలన నిర్ణయం: జగ్గారెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు సంచలన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 3 Jul 2022, 1:45 pm

ప్రధానాంశాలు:

  • టీ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి లొల్లి
  • రేవంత్ రెడ్డి ఆగ్రహం
  • రేపు సంచలన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుగా విసిగిపోయిన ఆయన గతంలోనే పార్టీని విడిచి వెళ్లేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌గాంధీ మాటకు కట్టుబడి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనలో పార్టీలో మళ్లీ చిచ్చు రేపింది. యశ్వంత్‌ సిన్హా పర్యటనను టీఆర్ఎస్ పార్టీ హైజాక్ చేసిన నేపథ్యంలోనే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ నేరుగా కలవడానికి వీల్లేదని రేవంత్ ఆదేశించారు. పార్టీ అధిష్ఠానం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు ఓటేస్తామని.. కానీ ఆయన్ని నేరుగా మాత్రం కలిసేది లేదని స్పష్టం చేశారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఓ రేంజ్‌తో ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీ ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ నౌకర్లు ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి చాలా రాంగ్ స్టెప్ వేశారు. టెంప్ట్ అయ్యేవారు ఆ పదవికి అర్హులు కాదు" అని పేర్కొన్నారు. తాజాగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు సంచలన నిర్ణయం ప్రకటించబోతున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి తీరుతో తాను విసిగిపోయానని.. రాహుల్‌కి ఇచ్చిన మాట తప్పానన్న ఆవేదనలో ఉన్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం లేకుండా వ్యవహరిస్తుండటంతో పార్టీకి నష్టం కలుగుతోందన్నారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.