యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు బంద్

Coronavirus in Hyderabad: శాసనసభ కమిటీ హాలులో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి ఈటల, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

Samayam Telugu 14 Mar 2020, 7:03 pm
కరోనా వైరస్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో థియేటర్లు, స్కూళ్లు మూసివేయాలని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం కేబినేట్ సమావేశం జరిగాక ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ బంద్ వర్తించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు మాత్రం యథాతథంగా జరగనున్నాయి. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి.
Samayam Telugu protestH-5.


Also Read: మంచిర్యాలలో విద్యార్థికి కరోనా! ఇటీవలే ఇటలీ నుంచి ఇంటికి..

కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం అసెంబ్లీ హాలులో భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read: శవాల మీద పేలాలు ఏరుకోకండి.. తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేసీఆర్

సినిమా థియేటర్లు, స్కూళ్లను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నారు. అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించనున్నారు. వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆది, సోమవారాలు సమావేశాలు నిర్వహించి.. ఆఖరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.

Must Read: కరోనా వల్ల చనిపోతే భారీ ఎక్స్‌గ్రేషియా.. కేంద్రం సంచలన నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.