యాప్నగరం

మారుతీరావు ఆత్మహత్య: వీలునామానే కొంపముంచిందా? సంచలన అనుమానాలు

Maruthi Rao Miryalaguda: తన కుమార్తె అమృత భర్త అయిన ప్రణయ్‌ను అంతమొందించేందుకు ముందు ఆస్తిని తన తదనంతరం తమ్ముడు శ్రావణ్‌కు చెందేలా మారుతీరావు వీలునామా రాసినట్లు తెలిసింది.

Samayam Telugu 8 Mar 2020, 4:17 pm
2018లో తెలంగాణలో సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంపై ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడంతా ఆయనకు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైనే చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, మారుతీరావు సంపాదించిన రూ.వందల కోట్ల ఆస్తే ఆయన ఆత్మహత్యకు కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మారుతీరావు రాసిన వీలునామా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
Samayam Telugu maruthi-rao


తన కుమార్తె అమృత భర్త అయిన ప్రణయ్‌ను అంతమొందించేందుకు ముందు ఆస్తిని తన తదనంతరం తమ్ముడు శ్రావణ్‌కు చెందేలా మారుతీరావు వీలునామా రాసినట్లు తెలిసింది. అయితే, కొన్ని కారణాలతో ఈ మధ్యే వీలునామాను మారుతీరావు మార్చాడు. ఆస్తి మొత్తం తమ్ముడికి దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో వీలునామా నుంచి తన తమ్ముడి పేరును తొలగించాడని తెలుస్తోంది. అంతేకాకుండా, కూతురు అమృతతో సయోధ్య కోసం కొంత కాలంగా మారుతీరావు మధ్యవర్తిత్వం పంపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తన ఇంటికి వచ్చేస్తే ఆస్తి కూతురికి రాసిస్తానని, అంతేకాక, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా కూడా మారుతీరావు అమృతను కోరినట్లు తెలుస్తోంది.

Also Read: తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై అమృత రియాక్షన్ ఇదే..

ఈ కోణంలోనే మారుతీరావు ఆత్మహత్య వెనుక ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మారుతీరావు వీలునామా మార్చడానికి దారి తీసిన పరిస్థితులపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, తాను చెబితేనే మారుతీరావు వీలునామాలో తన పేరు లేకుండా చేశాడని సోదరుడు శ్రవణ్ ఆదివారం మీడియాకు చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.