యాప్నగరం

గనిలోకి వెళ్లి తిరిగిరాని కార్మికుడు.. గోదావరిఖనిలో టెన్షన్

Singareni Collieries కార్మికుడు గోదావరిఖనిలో గనిలో దిగి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు.

Samayam Telugu 8 Apr 2020, 11:38 am
సింగరేణి కార్మికుడు ఒకరు గనిలోకి దిగి తిరిగి రాకపోవడం గోదావరిఖనిలో ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 7) గనిలో మోటార్ రన్ చేయడానికి వెళ్లిన కార్మికుడు సంజీవ్.. ఆ తర్వాత తిరిగి రాలేదు. అతడి కోసం అధికారులు అర్ధరాత్రి వరకు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 11 ఇంక్లైన్ బొగ్గుగనిలోని నాలుగో సీమ్, ఒవటవ డిప్ వద్ద మోటార్ రన్ చేయడానికి సంజీవ్ వెళ్లినట్లు సింగరేణి సిబ్బంది తెలిపారు. అయితే.. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని వెల్లడించారు.
Samayam Telugu coal
నమూనా చిత్రం


మంగళవారం రాత్రి జీఎంతో సహా అధికారులంతా కలిసి గనిలో వెతికారు. అయినప్పటికీ ఫలితం లేదు. సంజీవ్ గని లోపల సంప్‌లో పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు. సింగరేణి గనిలో సంజీవ్ గల్లంతైన విషయం తెలుసుకొని అతడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Also Read: షాద్‌నగర్ మహిళ మరణం వెనుక మర్కజ్ మూలాలు.. 7 వేల మందికి పరీక్షలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.