యాప్నగరం

సింగరేణి బిడ్డ అరుదైన ఘనత.. అమెరికాలోని ప్రముఖ వర్సిటీలో సీటు

Mancherial: సుహర్ష మంచిర్యాలకు చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని సుహర్ష ఆనందం వ్యక్తం చేశారు.

Samayam Telugu 25 Jul 2020, 3:40 pm
కోవిడ్‌ ప్రభావంతో విద్యావ్యవస్థ అల్లకల్లోలం అయిన వేళ కొందరు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజ్ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్ధులల్లో ఇటీవల సూర్యదీపిక, ఇప్పుడు సుహర్ష ప్రతిష్ఠాత్మక అమెరికా యూనివర్శిటీ ఆఫ్‌ అబర్న్‌లో ఎంఎస్సీ సీటు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్‌ కాలేజీ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌‌లో చివరి ఏడాది చదువుతున్న వీరిద్దరికీ ఈ అరుదైన అవకాశం లభించింది. గతంలో సూర్య దీపిక, ఎంఎస్సీ ఫారెస్ట్‌ జెనటిక్స్‌లో సీటు సాధించింది. తాజాగా సుహర్ష ఎమ్మెస్సీ ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో రెండేళ్ల కోర్సుకు ఎంపికైంది.
Samayam Telugu సుహర్ష
singareni employee daughter gets seat in auburn university


అంతేకాక, ట్యూషన్‌ ఫీజు రెండేళ్లకు కలిపి 30 వేల డాలర్లను యూనివర్శిటీ మినహాయింపు ఇవ్వడం విశేషం. దీంతో పాటు 1,500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా రెండేళ్లపాటు ఆఫర్‌ చేసింది. ఈ మొత్తం భారతీయ కరెన్సీలో సుమారు 50 లక్షల వరకూ ఉండనుంది. అబర్న్‌ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ ఫారెస్ర్టీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ బయాలజీ డీన్‌గా ఉన్న జానకీరామ్‌ రెడ్డి సహకారంతో వీరిద్దరికీ సీటు లభించింది. తెలంగాణ ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చివరి ఏడాదిలో మొత్తం 49 మంది విద్యార్థులు ఉంటే అందులో 31 మంది అమ్మాయిలే. మరో ఆరుగురు విద్యార్థినులు ఫారెస్ట్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీ డెహ్రాడూన్‌లో ఫుడ్‌ టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేసేందుకు వెళ్లనున్నారు.

సుహర్ష మంచిర్యాలకు చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని సుహర్ష ఆనందం వ్యక్తం చేశారు. అనువైన వాతావరణం, సిబ్బంది వల్లే తమకు ఈ అవకాశం లభించిందని సుహర్ష అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.