యాప్నగరం

సిరిసిల్ల ఎస్పీ సరికొత్త ప్రయోగం.. ప్రజలతో ముఖాముఖీ, కేసుల పరిష్కారం

Sircilla ఎస్పీ రాహుల్ హెగ్డే వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. ప్రజలతో నేరుగా ముఖాముఖీ అవడం ద్వారా సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించనున్నారు.

Samayam Telugu 18 Sep 2019, 3:57 pm
తెలంగాణలో తొలిసారిగా ఓ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగానికి తెర తీశారు. తన బృందంలోని పోలీస్ అధికారులందరితో కలిసి స్వయంగా తానే జిల్లా ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. దీని ద్వారా జిల్లాలో ఎవరికైనా చట్టపరమైన సమస్యలు ఉన్నా, ఏవైనా కేసుల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నా స్వయంగా తెలుసుకోనున్నారు. వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 24) జిల్లా ఎస్పీ కార్యాలయంలో తనను వ్యక్తిగతంగా సంప్రదించవచ్చని తెలిపారు.
Samayam Telugu rahul


ఆ రోజు జిల్లా పోలీసు ఉన్నతాధికారులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలోని ఎస్.హెచ్.ఓ. సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Must Read: టిక్ టాక్‌తో అదరగొడుతున్న అత్త.. పరువు పోతోందంటున్న అల్లుడు

ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను, వినతులను స్వీకరించి వాటిని అక్కడిక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. చట్టపరమైన, భద్రతాపరమైన సమస్యలు ఏవైనా ఉంటే నిర్భయంగా తమతో చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.