యాప్నగరం

గ్యాస్ సిలిండర్ డెలివరీలో మార్పులు.. డోర్ డెలివరీ కాకుండా..

Gas Cylinder Delivery: కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటున్న వేళ ప్రజలకు అందుతున్న కొన్ని సేవల్లో మరిన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు. ఈ జాగ్రత్త చర్యల్లో భాగంగానే వంట గ్యాస్‌ సరఫరా చేసే సంస్థలు ఇళ్లకు సిలిండర్ల డెలివరీలో స్వల్ప మార్పు చేశాయి.

Samayam Telugu 19 Apr 2020, 5:30 pm
కరోనా వైరస్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. అయినా, రోజూ కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటున్న వేళ ప్రజలకు అందుతున్న కొన్ని సేవల్లో మరిన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు. ఈ జాగ్రత్త చర్యల్లో భాగంగానే వంట గ్యాస్‌ సరఫరా చేసే సంస్థలు ఇళ్లకు సిలిండర్ల డెలివరీలో స్వల్ప మార్పు చేశాయి.
Samayam Telugu LPG


గ్యాస్ కావాల్సిన వారు సిలిండర్ బుక్ చేశాక డెలివరీ బాయ్ నేరుగా ఇంటి ముందుకు లేదా లోపలకు వచ్చి గ్యాస్ సిలిండర్ అందించేవాడు. తాజా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇకపై అలా కుదరదు. ఇంటి గేటు వరకే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వస్తాడని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డీలర్ల సంఘం ప్రకటించింది. కరోనా వైరస్ ధాటికే వంట గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో ఈ స్వల్ప మార్పు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి గ్యాస్‌ కంపెనీలకు ఆదేశాలు అందాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్, గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఈ విధానాన్నే అవలంబించనుంది.

Also Read: undefined

కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్న క్రమంలో భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ చీఫ్ ఆర్‌.శ్రావణ్‌ రావు స్పందించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది రక్షణ కోసమే ఈ నిర్ణయం గ్యాస్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూనే సిలిండర్లను డెలివరీ చేస్తామని తెలిపారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.