యాప్నగరం

హైదరాబాద్‌లో వరద: ‘కేటీఆర్‌కు ట్వీట్ చేసినా పట్టించుకోట్లేదు’

Nagole: మంత్రి కే‌టీ‌ఆర్‌కు ట్వీట్ చేసినా సమస్య తీరడం లేదని కాలనీ వాసులు చెప్పారు. ఇప్పటివరకు నలుగురికి గాయాలు కాగా.. ఓ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపారు.

Samayam Telugu 30 Oct 2020, 6:56 am
హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. నగరంలోని నాగోల్ డివిజన్ పరిధిలోని బృందావన కాలనీలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. రోజుల తరబడి వరద నీరు నిల్వ ఉండి రోడ్లపై మొత్తం నాచు ఏర్పడింది. దీంతో తాము జారి కిందపడి గాయపడుతున్నట్టు స్థానికులు చెప్పారు. ఇదే విషయంపై మంత్రి కే‌టీ‌ఆర్‌కు ట్వీట్ చేసినా సమస్య తీరడం లేదని వారు చెప్పారు. ఇప్పటివరకు నలుగురికి గాయాలు కాగా.. ఓ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
Samayam Telugu కాలనీ వాసులు
ktr


గత 20 రోజులుగా కాలనీల్లో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ అధికారి, నాయకుడూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తమ కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.