యాప్నగరం

టీ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో గేట్లు బంద్! సోనియా గాంధీ సీరియస్

Telangana Congress: టీపీసీసీ పదవి కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ కార్య నిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

Samayam Telugu 17 Dec 2020, 7:02 pm
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. తాము పిలిస్తే తప్ప అనవసరంగా ఎవరూ ఢిల్లీ రావొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు తేల్చి చెప్పింది. సోనియా గాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం కుదరదని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యాలయం స్పష్టం చేసింది. తెలంగాణ పీసీసీ చీఫ్ కోసం ఆశావహులు ఢిల్లీకి వెళ్లి తరచూ సోనియా గాంధీతో భేటీలు జరుపుతున్న తరుణంలో అధిష్ఠానం వారికి గేట్లు మూసేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu సోనియాగాంధీ (ఫైల్ ఫోటో)
Soniagandhi


టీపీసీసీ పదవి కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ కార్య నిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే, రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నుంచే ఓ వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దంటూ ఏకంగా లేఖపై సంతకాలు చేసి అధిష్ఠానానికి పంపారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లి సోనియాతో భేటీ అయ్యారు. రేవంత్ కూడా ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

పెళ్లైన 15 రోజులకే.. బాధ భరించలేక సూసైడ్ నోట్
పీసీసీ చీఫ్‌ పదవికి ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ గతంలోనే రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. దానిపై అధిష్ఠానానికి నివేదిక కూడా ఇచ్చారు. తాజాగా ఆయన మళ్లీ హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. ఈసారి జిల్లాస్థాయి నేతలతోనూ చర్చించి ఎవరికి పగ్గాలు అప్పగిస్తే బావుంటుందనే దానిపై అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.