యాప్నగరం

సొనూసూద్ స్పెషల్ రిక్వెస్ట్.. ఉప్పల్ వాసికి ఉచితంగా ఆపరేషన్

సోనూ సూద్ చేస్తున్న మంచి పనులతో హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ తాను కూడా ఎవరికైనా సాయం చేయాలనుకున్నాడు. ఓ మహిళలకు ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్ నిర్వహించాడు.

Samayam Telugu 21 Oct 2020, 7:21 am
సినీనటుడు సోనూసూద్ చేస్తున్న సాయం గురించి ప్రస్తుతం దేశమంతా చెప్పుకుంటోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల విషయంలో ఆయన చేసిన సాయం చూసి దేశప్రజలంతా కొనియాడారు. వలస కార్మికులు అయితే సోనూ సూద్‌ను దేవుడితో సరిపోల్చారు. ఆ తర్వాత ఆయన ఎవరికీ ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చిన నేనున్నానంటూ సోనూ సూద్ అక్కడ తన సాయాన్ని అందించారు. దీంతో సోనూ రియల్ హీరో అంటూ ప్రజలంతా ప్రశంసలు అందించారు. అయితే తాజాగా సోనూ చేసిన రిక్వెస్ట్‌తో ఓ ఆస్పత్రి పేషెంట్‌కు ఉచిత సాయం అందించింది
Samayam Telugu సోనూ సూద్
sonu sood


Read More: తెలంగాణలో దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా: మంత్రి సబితా

‌ ట్విట్టర్‌ ద్వారా చేసిన వినతి మేరకు ఉప్పల్‌ నివాసి జయమ్మ(62) మోకాలిచిప్ప మార్పిడి చేశామని డా.విజయభాస్కర్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ దోమలగూడలోని రవి పీలియోస్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని ఆయన చెప్పారు. ఈ శస్త్రచికిత్సకు రూ.2 లక్షల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. సోనూసూద్‌ చేస్తున్న సేవలను గౌరవించి తాము ఉచితంగా శస్త్రచికిత్స చేశామన్నారు. ప్రస్తుతం జయమ్మ కోలుకుంటున్నారని త్వరలో నడుస్తారని ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.