యాప్నగరం

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లూ బంద్.. పాక్షిక సర్వీసులివే..

Janata Curfew: ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు బయల్దేరే అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశామని.. రైల్వే స్టేషన్లలో ఉండే వేచి ఉండే గదులు, దుకాణాలు, ఫుడ్‌ స్టాళ్లను మూసే ఉంచుతామని అధికారులు చెప్పారు.

Samayam Telugu 21 Mar 2020, 2:48 pm
జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను బాగా రద్దు చేశారు. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. రోజంతా కర్ఫ్యూ ఉన్నా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రోజులో 12 ఎంఎంటీఎస్‌ సర్వీసులు మాత్రం నడపాలని నిర్ణయించినట్లుగా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాక, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 250కి పైగా ప్యాసింజర్‌ రైళ్లను కూడా రద్దు చేసినట్లు చెప్పారు.
Samayam Telugu unnamed


ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు బయల్దేరే అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశామని.. రైల్వే స్టేషన్లలో ఉండే వేచి ఉండే గదులు, దుకాణాలు, ఫుడ్‌ స్టాళ్లను మూసే ఉంచుతామని అధికారులు చెప్పారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులంతా సహకరించాలని కోరారు. జంట నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసులు 121 ఉండగా, వాటిలో 109 రద్దు చేశారు.

Also Read: పెళ్లిలో మంత్రాలకు బదులు కరోనా వైరస్ స్తోత్రాలు.. వీడియో వైరల్

మరోవైపు, మెట్రో రైళ్లను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మెట్రో అనుబంధ షాపింగ్ మాల్స్ అయిన గలేరియా మాల్స్‌ను కూడా మూసి వేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, దిల్లీ మెట్రో సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు శుక్రవారమే ఆ సంస్థ ప్రకటించింది.

Must Read: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు బంద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.