యాప్నగరం

శ్రావణి ఆత్మహత్య కేసు.. పోలీస్ కస్టడీలో నిందితులు సాయి, దేవరాజ్

శ్రావణి ఆత్మహత్యకు ముందు ముగ్గురు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి. శ్రీకన్య హోటల్ వద్ద ముగ్గురు మధ్య జరిగిన గొడవ ఈ విషయంలో కూడా పోలీసులు సీన్ రికనస్ట్రక్ట్ చేయనున్నారు.

Samayam Telugu 26 Sep 2020, 11:34 am
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఇద్దరు నిందితులైన సాయికృష్ణ, దేవరాజ్‌ను మూడురోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారి నుంచి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీన్ రికనస్ట్రక్షన్ చేయనున్నారు ఎన్ఆర్ నగర్ పోలీసులు. శ్రావణి ఆత్మహత్య కు ముందు శ్రీకన్య హోటల్ లో సాయి కృష్ణ రెడ్డి, దేవ రాజ్, శ్రావణి ల మద్య గొడవ జరిగింది.
Samayam Telugu శ్రావణి ఆత్మహత్య కేసు
sravani suicide case


ఆత్మహత్య కు ముందు ముగ్గురి సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కేసులో లభించిన ఆడియోలు విడియోల ఆధారంగా ఇద్దరు నిందితులను విచారించి వారి ద్వారా వచ్చే సమాచారం స్టేట్ మెంట్ ను చార్జిషీట్లో పొందు పరచనున్నారు.
ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులో మూడో నిందితుడుగా ఉన్నఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు.

Read More:
హైదరాబాద్‌లో హై అలర్ట్.. అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దు

టీవీ సీరియల్ నటి, మనసు మమత, మౌనరాగం ఫేమ్‌ శ్రావణి అనుమానాస్పద స్థితిలో బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కుటుంబసభ్యులు.. టిక్ టాక్‌లో పరిచయం అయిన దేవరాజ్ అనే వ్యక్తి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దేవరాజ్ మాత్రం తల్లిదండ్రులు, సాయి అనే వ్యక్తి పెడుతున్న వేధింపులు భరించలేక చనిపోయిందని దేవరాజ్ ఆరోపిస్తున్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు. సాయి, దేవరాజ్‌ను అరెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.