యాప్నగరం

కరోనా దెబ్బ.. ఎల్లారెడ్డిలో ఆకలిచావు!

కరోనా వైరస్ దెబ్బకు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. దీంతో చాలా మందికి ఒక పూట తిండే కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తి ఆకలి బాధ తాళలేక ప్రాణాలు వదిలాడు.

Samayam Telugu 3 Aug 2020, 2:58 pm
కరోనా ప్రభావంతో జీవనోపాధిని కోల్పోయిన పేదలకు సరైన తిండి సైతం దొరకడం లేదు. దీంతో చాలా మంది ఒక పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సి వస్తోంది. చేద్దామని పని దొరకకపోవడంతో.. తిండి కరువైన ఓ వ్యక్తి ఆకలితో ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. అన్నాసాగర్ గ్రామానికి చెందిన కిష్టయ్య (40) అనే వ్యక్తి కొన్నేళ్లుగా పట్టణంలోని ఓ హాస్పిటల్‌లో పని చేసి జీవనం సాగిస్తున్నాడు.
Samayam Telugu నమూనా చిత్రం


లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు మూతపడటం, ఆ తర్వాత హోటళ్లు తెరిచినా సరిగా నడవకపోవడంతో కిష్టయ్య పని కోల్పోయాడు. ఏ పని దొరికితే ఆ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ ఇటీవల పనులేవీ దొరక్కపోవడంతో చేతిలో డబ్బులు లేక ఆకలితో అలమటించినట్లు తెలుస్తోంది. రోజూ గవర్నమెంట్ హాస్పిటల్ పాత భవనం వద్ద పడుకునేవాడు.

ఆదివారం ఉదయం కిష్టయ్య నిద్రలేవకపోవడంతో... స్థానికులు పోలీసుల సాయంతో అతడి సోదరులకు సమాచారం అందించారు. వారొచ్చి కిష్టయ్య డెడ్ బాడీని తీసుకెళ్లి అన్నాసాగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.