యాప్నగరం

జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్ని పార్టీలకు ఎస్ఈసీ లేఖలు

కరనా కారణంగా ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలకు ఎస్ఈసీ లేఖలు రాసింది.మరో నాలుగైదు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

Samayam Telugu 22 Sep 2020, 7:04 am
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల ఏర్పాట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఎస్‌ఈసీ లేఖలు రాసింది. కోవిడ్‌ కారణంగా బ్యాలెట్‌ పేపర్‌, ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయం తెలియజేయాలని ఈసందర్భంగా సూచించింది. ఈ నెల 30 లోపు పార్టీలు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నది.
Samayam Telugu గ్రేటర్ ఎన్నికలు
ghmc


ఒకవేళ ఎవరైనా ఈనెల 30వ తేదీ తర్వాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోమని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి శుక్రవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, కోవిడ్‌ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు. మరో నాలుగైదు నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వం సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.