యాప్నగరం

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ షెడ్యూల్ విడుదల.. కొత్తగా ఓటు హక్కు కోసం ఇలా..

Election Commission: 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. నవంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తామని తెలిపారు.

Samayam Telugu 12 Aug 2020, 9:48 pm
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు విడుదలైంది. 2021 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. అక్టోబర్‌ నెలాఖరు వరకు ప్రీ రివిజన్‌, పోలింగ్‌ కేంద్రాల సర్దుబాటు, డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. నవంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తామని తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Voter list in telangana


డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు అభ్యంత‌రాలు, విన‌తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది. ఇందుకోసం పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు, సిబ్బంది అంద‌రికీ అందుబాటులో ఉండేలా నెల‌లో రెండు శ‌ని, ఆదివారాలు ప్రత్యేక అవ‌గాహ‌న కార్యక్రమాలు చేప‌డ‌తారు. 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఆ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసు ఉన్నవారికి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. www.nvsp.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని శాశంక్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.