యాప్నగరం

సుప్రీంకోర్టులో ఎన్‌కౌంటర్‌పై విచారణ.. సర్వత్రా ఉత్కంఠ!

దీనిపై విచారణలో ఏ మలుపు తిరుగుతుందోనని నిందితుల కుటుంబసభ్యులతోపాటు, యావత్ ప్రజానీకం ఉత్కంఠలో ఉంది. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీం ధర్మాసనం ఏం చెప్తుందో, ఏరకమైన తీర్పు ఇస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Samayam Telugu 11 Dec 2019, 2:35 pm
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విచారణలో ఏవిధంగా, ఏ మలుపు తిరుగుతుందోనని నిందితుల కుటుంబసభ్యులతోపాటు, యావత్ ప్రజానీకంలో ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీం ధర్మాసనం ఏం చెప్తుందో, ఏరకమైన తీర్పు ఇస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
Samayam Telugu supreme court


మరోవైపు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని, అప్పటివరకూ అంత్యక్రియలేవీ నిర్వహించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసుపై విచారణ సుప్రీంకోర్టులో ఉండడంతో తాము, మరుసటి రోజు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే నిందితుల మృతదేహాలను గత 5 రోజుల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో భద్రపర్చారు. ఇవి మరో మూడు రోజులు ఇక్కడే ఉండనున్నాయి.

Also Read: గజ్వేల్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. వివరాలివీ..

ఇంకోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు విచారణను పూర్తి చేశారు. వీరు విచారణలో భాగంగా నిందితుల కుటుంబసభ్యుల నుంచి వయసు ధ్రువీకరణ సర్టిఫికేట్లను సేకరించారు. దీంతోపాటు మృతదేహాల పోస్టుమార్టం నివేదికలను అధ్యయనం చేశారు

Also Read: Disha Case: ఎన్‌కౌంటర్ నిందితుల్లో ఇతనికి 14 ఏళ్లే..?

ఎన్‌కౌంటర్ వ్యవహారంపై మొత్తానికి శుక్రవారం తుది తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ఆ సమయానికి నిందితుల కుటుంబాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. మరోవైపు నిందితుల స్వగ్రామాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

Also Read: ఇంటర్ ఫలితాల విడుదలకు కొత్త సాఫ్ట్‌వేర్.. తప్పుల్లేకుండా ఇలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.