యాప్నగరం

సూర్యాపేటలో ఎస్సై దాష్టీకం.. ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారిపై దాడి!

Suryapet: సూర్యాపేట జిల్లాలోని నాగారాం పోలీస్ స్టేషన్‌ ఎస్సై తమపై దాడి చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు సమస్య పరిష్కారం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.

Samayam Telugu 7 Aug 2020, 5:55 pm
రాష్ట్రంలో స్నేహ పూర్వక పోలీస్ వ్యవస్థ ఉందని మంత్రి సహా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న అందుకు వ్యతిరేకమైన ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తమ సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదు చేసినవారిపైనే దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను కొంత మంది అబాసుపాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని నాగారాం పోలీస్ స్టేషన్‌లో ఇందుకు నిదర్శనమైన ఘటన ఒకటి జరిగింది. ఓ ఎస్సై దాడికి దిగడంతో సాయం కోసం బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
TS police representative


ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై నాగారం ఎస్సై లింగం దౌర్జన్యం చేసి, దాడికి పాల్పడ్డారు. లాఠీతో చితకబాదాడని బాధితుడు వాపోయాడు. సివిల్ కేసులో తలదూర్చడమే కాకుండా, న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన రైతులపైనే దాడికి పాల్పడ్డట్లుగా ఆరోపించారు. చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడని రైతులు వెల్లడించారు. దీంతో చేసేది లేక ప్రాణభయంతో రైతులు జిల్లా ఎస్పీ భాస్కర్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. రైతులపై దాష్టీకానికి దిగిన ఎస్ఐ లింగంపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.