యాప్నగరం

నేషనల్ యూత్ డే.. ఆర్కే మఠ్‌లో జనవరి 11, 12న యువ సమ్మేళనం

భారతీయ సమాజాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా పాశ్చాత్య దేశాలకు యోగ, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాలు, వాదనల ద్వారా పరిచయం చేసిన యోగి స్వామి వివేకానంద. నేటి యువతకు ఆయన ఎంతో ఆదర్శప్రాయుడు.

Samayam Telugu 2 Jan 2020, 1:52 pm
స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో యువజన దినోత్సవ వేడుకలను జనవరి 11, 12 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జనవరి 11న శనివారం మఠం పరిధిలోని అన్ని విభాగాల పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరుగుతుందని, దీనిలో అందరూ పాల్గొనవచ్చని ఆర్కే మఠం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రవేశ రుసుం కింద రూ.50 చెల్లించాల్సి ఉంటుందని, ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని తెలిపారు.
Samayam Telugu vivekananda


రెండో రోజు జనవరి 12న ఆదివారం స్వామి వివేకానందుడి పుట్టిన రోజున ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ట్యాంక్ బండ్ నుంచి రామకృష్ణ మఠం వరకు అవేకినింగ్ ఇండియా వాక్ నిర్వహించనున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి 2.00 గంటల వరకు యువసమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానానంద, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ఐఐఎం-ఇండోర్ మాజీ డైరెక్టర్ తదితరులు పాల్గొంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.