యాప్నగరం

కేసీఆర్ కనపడకపోతే నష్టమేంటి..? మంత్రి తలసాని తీవ్ర వ్యాఖ్యలు

Hyderabad: కరోనా కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కరోనా ఏ స్థాయిలో ఉన్నా.. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను ఆపగలరని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 9 Jul 2020, 2:50 pm
కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోవడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సీఎంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కనిపించకపోతే ఇప్పుడు తెలంగాణలో ఏమైనా పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయా? అని నిలదీశారు. గురువారం తలసాని విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani


కొత్త సచివాలయ నిర్మాణం గురించి స్పందిస్తూ.. పరిపాలన కోసం సచివాలయం కీలకమని, కొత్తది కడితే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎంఐఎంతో కలిస్తే కరోనా వచ్చేస్తోందా? కేంద్రమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చేతనైతే ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని హితవు పలికారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయని చెప్పారు.

లాక్‌డౌన్‌తో ప్రయోజనం లేదు
కరోనా కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కరోనా ఏ స్థాయిలో ఉన్నా.. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను ఆపగలరని వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావే ఉదాహరణ అని గుర్తు చేశారు. ఫిజికల్ ఫిట్‌నెస్ లేనివారు, సరిగ్గా రోగ నిరోధక శక్తి లేనివారు మాత్రమే కరోనాతో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.