యాప్నగరం

బీజేపీలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఎంపీ అరవింద్‌పై జనసేన సీరియస్

బీజేపీ అగ్రనేతలతో చర్చించాకే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని. ఆ విషయం తెలియక.. ఎంపీ అరవింద్ ఇలా వ్యాాఖ్యలు చేయడం సరికాదన్నారు జనసేన నాయకులు.

Samayam Telugu 28 Nov 2020, 4:00 pm
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై జనసేన నేతలు సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని అరవింద్ చేసిన వ్యాఖ్యల్ని జనసేన నాయకులు తప్పు పట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంపీ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన నేత నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అగ్రనేతలు కోరిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన పార్టీ తప్పుకొని బీజేపీకి మద్దతు ఇచ్చిందని తెలిపారు.
Samayam Telugu బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
bjp mp dharmapuri arvind


అయితే ఎంపీ అరవింద్ ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ముందు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు ఆ తర్వాత మాట్లాడాలని ఎంపీకి జనసేన నాయకులు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేతల లక్ష్మణ్ ఇతర అగ్ర నేతలు మద్దతు ఇవ్వాలని కోరారన్నారు. దీంతో విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక్క ఓటు కూడా చీలకూడదనే ఉద్దేశంతోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పోటీ నుంచి విరమించుకున్నారన్నారు. పవన్ నిర్ణయంతో అప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు కొంతవరకు నిరుత్సాహానికి గురయ్యారన్నారు. 60 డివిజన్లలో పార్టీ పోటీ చేయాలని భావించిందన్నారు. కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారన్నారు. జనసేన పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందని భావించిందన్నారు.

Read More: హైదరాబాద్ పర్యటనకు ముందే కేసీఆర్‌కు షాకిచ్చిన మోదీ

అందుకే అధ్యక్షుడు మాటే శిరోధార్యంగా భావించి ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారన్నారు. జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకుల్ని అడిగి తెలుసుకోవాలని ఎంపీ అరవింద్‌కు జనసేన నాయకులు సూచించారు. అంతేకాని జనసైనికుల్ని రెచ్చగొట్టే ధోరణిలో అరవింద్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ గెలుపు కోసం జనసైనికులు శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంటింటికి బైక్ ర్యాలీలు చేసి ప్రచాం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అరవింద్ వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ మనో భావాలు దెబ్బతీస్తున్నాయన్నారు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.