యాప్నగరం

తెలంగాణ అసెంబ్లీలో 8 బిల్లులకు ఆమోదం.. రేపటికి వాయిదా

ఆరవరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లుల్ని సభ వాయిదా పడింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం.

Samayam Telugu 14 Sep 2020, 4:23 pm
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
Samayam Telugu తెలంగాణ అసెంబ్లీ
telangana assembly

ఎనిమిది బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

సభలో ఇవాళ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల సమస్యలు, కారుణ్య నియామకాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, కారుణ్య నియామకాలను అర్హతలను బట్టి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జీరో అవర్ కొనసాగింది. ఆ తర్వాత సభలో పలు బిల్లులపై సభలో జరిగింది. దీనిపై పలువురు మంత్రులు వివరణ ఇవ్వడంతో సభ మోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

Read More: కేంద్రంపై కేటీఆర్ సీరియస్.. మోకాలడ్డుతుందని మంత్రి ఫైర్

ఎనిమిది బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. సభ ఆమోదించిన బిల్లుల వివరాలు చూస్తే...

1) తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు

2) తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు

3) తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు

4) తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు

5) తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు

6) తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం (టీ ఎస్- బి పాస్) బిల్లు

7) తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు

8) తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.