యాప్నగరం

ఆ పథకాలు అమలు చేస్తే మీ ఖేల్ ఖతమే.. కొత్త స్కీమ్‌లపై హింట్ ఇచ్చిన కేసీఆర్

KCR Assembly Speech | అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ కొత్త పథకాలపై హింట్ ఇచ్చారు. తాము మరో 2-3 పథకాలను అమలు చేస్తామన్నారు. అవి అమలైతే ప్రతిపక్షాల ఖేల్ ఖతమేనన్నారు.

Samayam Telugu 22 Sep 2019, 2:26 pm
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ ఉద్యోగాలు, వీఆర్వో వ్యవస్థ, కౌలు రైతులకు రైతు బంధు తదితర అంశాలపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. ఉద్యోగాలు అడగొద్దని మేం అనడం లేదు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అడొగ్గొద్దంటున్నా అని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగానికి తప్పుడు నిర్వచనం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? అని కేసీఆర్ ప్రశ్నించారు.
Samayam Telugu kcr61


మా దగ్గర ఇంకో రెండు మూడు పథకాలు ఉన్నాయి. అవి అమలు చేస్తే మీ పని ఖతమేనని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తానేమీ ఆషామాషీగా ఏం మాట్లాడటం లేదన్న సీఎం.. ఇంకో రెండు దఫాలు మేమే అధికారంలో ఉంటామన్నారు.

Read Also: వీఆర్వోలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా?: కేసీఆర్

కేసీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ అమలు చేయబోయే ఆ స్కీమ్‌లు ఏంటనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు టీఆర్ఎస్ సర్కారుకు మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ మాటలను చూస్తుంటే.. ఈ పథకాల కంటే మిన్నగా కొత్త స్కీమ్‌లు ఉండబోతున్నాయని అర్థమవుతోంది. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా డబ్బులు లేవంటోన్న కేసీఆర్ వీటిని ఎలా అమలు చేస్తారో చూడాలి.

Read Also: అమిత్ షా యాటిట్యూడ్ మార్చుకోవాలి.. మోదీ ఆ మాట అనొద్దు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.