యాప్నగరం

పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అగ్రనేతల భేటీ.. పొత్తు కుదిరేనా?

ఈ భేటీకి ముందే మీడియాతో మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు విషయమై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 19 Nov 2020, 2:17 pm
జీహెచ్ఎంసీ ఎన్నీకల నేపథ్యంలో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్‌లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికలలో కలసి పోటీచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని జనసేన, భారతీయ జనతా పార్టీ లు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ , ఆ పార్టీ అగ్ర నేతలు కలవనున్నారు. ఈ నిర్ణయంతో ఇరు పార్టీల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్, బండి సంజయ్
bandi sanjay pawan kalyan


అయితే మరో వైపు బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై కీలక చర్చ జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్‌తో భేటీలో ఇరుపార్టీలు ఏయే అంశాలపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలు చేస్తున్నారు.

Read More: KTR: మోదీ మాటే మా మాట.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పటికే జీహెచ్ఎంసీలో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ, జీహెచ్‌ఎంసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వారి వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.