యాప్నగరం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు

Chalo Assembly: బీజేపీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన ఉందని, నిజాం, రజాకార్ల పక్షాన కేసీఆర్‌ ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Samayam Telugu 11 Sep 2020, 2:15 pm
అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను గోషామహల్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో బండి సంజయ్‌ను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకుని నిరోధించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu బండి సంజయ్ అరెస్టు
Telangana BJP President bandi sanjay


బీజేపీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన ఉందని, నిజాం, రజాకార్ల పక్షాన కేసీఆర్‌ ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ అసెంబ్లీ ముట్టడితో మరోసారి రుజువయిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించిందని ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Must Read: స్వలింగ సంపర్కానికి బ్యాంకు అధికారి ఒప్పందం.. వెళ్లి చూస్తే షాక్! చివరికి ఇద్దరిపైనా కేసు

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.