యాప్నగరం

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం

తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురందించింది. వారు కొనుగోలు చేసే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వాహనాలకే అది వర్తించనుంది.

Samayam Telugu 24 Nov 2021, 10:44 pm
పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండడం ప్రజల నెత్తిన పెనుభారంగా మారింది. అడ్డూఅదుపూలేని ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది. పెట్రోల్ పుణ్యమాని నిత్యవసర సరుకుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. రవాణా ఖర్చుల భారం పెరిగిందన్న సాకుతో వ్యాపారులు అంతకంతకూ రేట్లు పెంచేస్తున్నారు. దీంతో సామాన్యుడి జీవనం దుర్భరంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ బదులు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


పెట్రోల్ ధరల భారం.. పొల్యూషన్ నియంత్రణకు ప్రోత్సాహమందించేలా నూతన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా వాహనాల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇకపై ఉద్యోగులు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. తొలుత లక్ష వాహనాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.